థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒకటి హైపో థైరాయిడిజం. రెండోది హైపర్ థైరాయిడిజం. రెండింటిలో ఏది వచ్చినా జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. ఏ వైద్య విధానంలోనూ దీనికి పూర్తిగా చికిత్స లేదు. కానీ థైరాయిడ్ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలను రాకుండా చూసేందుకు ఇతర వైద్య విధానాలు దోహదపడతాయి.
ఇక థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీ, కాలిఫ్లవర్ లను తినకూడదని అంటుంటారు. వీటిని తింటే థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం పడుతుందని, దీంతో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావని చెబుతుంటారు. అయితే ఇందులో నిజమెంత ? అంటే…
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా ఆయా కూరగాయలను తినవచ్చు. కాకపోతే కొద్ది మొత్తంలో తీసుకోవాలి. పూర్తిగా మానేయమని ఏ వైద్యుడూ చెప్పడు. షుగర్ సమస్య ఉన్నవారు పూర్తిగా స్వీట్లను మానరు కదా. ఎప్పుడో ఒకసారి కొద్దిగా తింటారు. ఇది కూడా అలాగే. అందువల్ల థైరాయిడ్ ఉందని చెప్పి కాలిఫ్లవర్, క్యాబేజీలను తినడం మానేయాల్సిన పనిలేదు. నిజానికి వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం మానేస్తే ఆ పోషకాలను కోల్పోతారు. కనుక థైరాయిడ్ ఉన్నప్పటికీ స్వల్ప మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల పెద్దగా ప్రభావం పడదు. కానీ థైరాయిడ్ కంట్రోల్‌లో లేని వారు, సమస్య ఎక్కువగా ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. అలాగే వీటిని తినాలనుకునే వారు ఎప్పుడో ఒకసారి కొద్దిగా తినవచ్చు. అంతేకానీ తరచూ తినకూడదు.