అనుకుంటాం గానీ ఒక్కోసారి మనం నిజమని నమ్మే పలు విషయాలు కూడా అబద్దాలు కావచ్చు. అవును, ఏమో చెప్పలేం. ఏది అబద్దమో, ఏది నిజమో తెలియని రోజులివి. మాటలకే దిక్కులేదు, ఇక వస్తువులను ఎవరు అడిగారు..? వాటి గురించి ఎవరు నమ్ముతారు..? ఏది నిజమో, ఏది అబద్దమో ఎలా తెలుస్తుంది..? అయితే… మాటలకేమో గానీ… వస్తువుల గురించైతే తెలుసుకోవచ్చు. అది సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. మరి ఈ మధ్య కాలంలో సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేయబడిన వస్తువులు ఏమిటో తెలుసా..? పాలు, బీరు. అవును, మీరు విన్నది కరెక్టే. అయితే ఏముందీ… బీరు తాగడం ఆరోగ్యానికి హానికరం, పాలు తాగడం శ్రేయస్కరం అని చెబుతారా..? కానీ కాదు. అలా చెబితే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనకు పాల కన్నా బీరే మిక్కిలి శ్రేయస్కరమట. మీరు షాక్‌కు గురైనా మేం చెబుతోంది నిజమే. అందుకే పైనే చెప్పాం కదా, మనం నిజమని నమ్మే పలు విషయాలు కూడా అబద్దాలు కావచ్చని. అవును, పాలు, బీరు విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది.
ఇంత కాలం మనం పాలు తాగితే ఆరోగ్యం కలుగుతుందని నమ్మాం కదా..! కానీ ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న పాలతో ఆరోగ్యం కాదు కదా, అన్నీ అనారోగ్యాలే కలిగేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయట. ప్రధానంగా ఇప్పుడు లభ్యమవుతున్న పాలు తాగడం వల్ల స్థూలకాయం, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉందట. అయితే రోజూ అలాంటి పాలు తాగడం కన్నా పరిమితిగా బీరును తీసుకుంటే దాంతో ఎముకలు దృఢంగా మారుతాయట. అంతేకాదు, ఆయుష్షు కూడా పెరుగుతుందట. మన శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయట. సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనలో పాలు, బీరు గురించి తెలిసిన విషయం ఇదే.
అయితే బీరు ఆరోగ్యానికి మంచిదేనని ఎక్కువగా మాత్రం తాగవద్దంటున్నారు. ఎందుకంటే ఏదైనా శృతి మించిదే అది మన ఆరోగ్యంపైనే కదా ప్రభావం చూపించేది. కాబట్టి పాలు తాగకపోయినా రోజుకో 300 ఎంఎల్ మోతాదులో బీరు తాగండి, దీంతో శరీరానికి అంతే మంచే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జంతువులను సంరక్షించే స్వచ్ఛంద సంస్థ పెటా కూడా ఈ విషయానికి మద్దతు తెలుపుతోంది. ఎందుకంటే పాలను సేకరించే కారణంతో మూగజీవాలను బాగా హింసిస్తున్నారని, అందుకే పాలను తాగడం ఆపితే వాటిపై హింస తగ్గుతుందని, అలాంటి వారు బీరు తాగండని ఆ సంస్థ అమెరికాలో ప్రచారం కూడా చేస్తోంది. ఇంతకీ ఈ విషయంలో మీరేమంటారు..?