Blood Groups : మనలో ప్రతి ఒక్కరూ ఒక్కోరకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిని చూసి వారి స్వభావాన్ని అంచనా వేయడం చాలా కష్టం. కానీ వారి బ్లడ్ గ్రూప్ ను చూసి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో బ్లడ్ గ్రూప్ వారు ఒక్కో వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగులను నియమించుకునేటప్పుడు వారి బ్లడ్ గ్రూప్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటారట. వేరు వేరు బ్లడ్ గ్రూప్ ల వారు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎ పాజిటివ్ గ్రూప్ రక్తం కలిగిన వారు చాలా సున్నితమనస్కులై ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా వారి కష్టాన్ని నమ్ముకుని పనులు పూర్తి చేస్తారు. అలాగే వీరికి త్యాగ గుణం కూడా ఎక్కువ. చాలా నిజాయితీగా ఉంటారు. ఎ నెగెటివ్ గ్రూప్ రక్తం కలిగిన వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొండిగా ఉంటారు. వారు చెప్పిందే నెగ్గాలని పట్టుబడతారు. సంప్రదాయలకు విలువనిస్తారు. అలాగే ఈ గ్రూప్ రక్తం కలిగిన వారికి చాదస్తం కూడా ఎక్కువగా ఉంటుంది.
బి పాజిటివ్ గ్రూప్ రక్తం కలిగిన వారు చాలా ఆవేశంగా ఉంటారు. అలాగే వీరు సాహోపేతమైన నిర్ణయాలను ఎక్కువగా తీసుకుంటారు. వీరికి ముక్కు మీద కోపం ఉంటుంది. బి నెగెటివ్ రక్త సమూహం కలవారు చాలా స్వార్థంగా ఉంటారు. బాధ్యత లేకుండా ఇతరులను కించపరుస్తూ అహంకార పూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు.
ఎబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి చాలా కలుపుగోలుతనాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ నిర్మల మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఎబి నెగెటివ్ రక్త సమూహం కలిగిన వారు చాలా సంక్లిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి ఒక పట్టాన ఎవరికీ అర్థం కారు. వీరు ఎప్పుడూ ఒక నిర్ణయంపై నిలబడరు. అవసరానికి తగినట్టుగా మారుతూ ఉంటారు.
ఒ పాజిటివ్ గ్రూప్ రక్తం వారు చాలా ఆహ్లాదంగా ఉంటూ పది మందితో చాలా సులువుగా కలసిపోతారు. భవిష్యత్తుపై ఆశావాహ దృక్పథంం కలిగి ఉండి చాలా ధైర్యంగా ముందుకు నడుస్తారు. ఒ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు చాలా అహంకారాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వారిని కించపరుస్తూ వారిపై నిందలు వేస్తూ ఉంటారు. అలాగే వీరికి గర్వం, అసూయ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా వేరు వేరు రక్త సమూహాలు కలిగిన వారు వేరు వేరు స్వభావాలని కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.