మన శరీరం సరైన బరువును కలిగి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. బరువు తగినంతగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు తక్కువగా ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్నా నష్టాలే కలుగుతాయి. అయితే అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి చేపలు ఎంతగానో మేలు చేస్తాయి. చేపలను తరచూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులే చెబుతున్నారు.
1. చేపలను తినడం వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. చేపల్లో ఉండే ప్రోటీన్లు శక్తిని అందించడమే కాదు, కండరాల నిర్మాణానికి సహాయ పడుతాయి. దీంతో శరీరం జీవక్రియలను సరిగ్గా నిర్వర్తిస్తుంది.
2. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు చేపలను తింటే వాటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయ పడుతాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
3. చేపలను తినడం వల్ల లభించే క్యాలరీలు కూడా తక్కువే. చికెన్, మటన్ కన్నా చేపలను తినడం ఎంతో మేలు. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారి డైట్‌కు ఎలాంటి ఆటంకం రాదు. పైగా చేపలను తింటే బరువు తగ్గుతారు.
4. చేపల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అందువల్ల ఏ రకంగా చూసినా చేపలు మనకు మేలే చేస్తాయి. వీటిని తినడం వల్ల బరువును తగ్గించుకోవడమే కాక, ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతున్న ప్రకారం.. రోజుకు 140 గ్రాముల చేపలను తినడం వల్ల తగిన పోషకాలు అందుతాయి. దీంతో బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365