హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల హైబీపీ వస్తోంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి నిరంతరం గురయ్యే వారికి హైబీపీ వస్తుంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇతర అవయవాలపై కూడా ఒత్తిడి పడుతోంది. అయితే హైబీపీ సమస్యకు పసుపుతో చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
పసుపులో కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. 100 గ్రాముల పసుపులో సుమారుగా 3 నుంచి 6 గ్రాముల మేర కర్‌క్యుమిన్ ఉంటుంది. ఇది ఒక సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్. హైబీపీని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
శరీరంలోని కొవ్వును కరిగించడంలోనూ పసుపు బాగా పనిచేస్తుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్టామేరీ గుణాలు ఉంఆయి. దీని వల్ల రక్తంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది.
అందువల్ల పసుపును రోజూ తీసుకోవాలి. రోజూ ఒక కప్పు నీటిలో కొద్దిగా పసుపు వేసి మరిగించి రెండు సార్లు తాగవచ్చు. లేదా రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగవచ్చు. దీంతో హైబీపీ తగ్గుతుంది.