Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టు సంజీవ‌ని.. ముఖ్యంగా పురుషుల‌కు..!

D by D
May 12, 2022
in వార్త‌లు, వృక్షాలు
Share on FacebookShare on Twitter

Nalla Thumma Chettu : ప్ర‌స్తుత తరుణంలో మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌లో, జీవ‌న విధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. దీని కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాం. మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో సంతాన లేమి స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. సంతాన లేమి అన‌గానే మ‌న‌కు ముందుగా స్త్రీ లు గుర్తుకు వ‌స్తారు. కానీ మ‌గ వారిలో కూడా సంతాన లేమి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌గ వారిలో వీర్య క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త‌, శీఘ్ర స్క‌ల‌నం వంటి వాటిని సంతాన లేమికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. మాన‌సిక ఒత్తిడి, ధూమపానం, మ‌ద్య‌ పానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌గ వారిలో కూడా సంతాన లేమి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

Nalla Thumma Chettu  amazing health benefits
Nalla Thumma Chettu

మ‌గ వారిలో క‌లిగే సంతాన లేమి స‌మ‌స్య‌ల‌కు ఆయుర్వేదంలో చ‌క్క‌టి ప‌రిష్కారం ఉంది. పూర్వ కాలంలో రైతులు వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగించే న‌ల్ల తుమ్మ చెట్టు సంతాన లేమి స‌మ‌స్య‌ల‌కు దివ్య ఔషధంగా ప‌ని చేస్తుంది. న‌ల్ల తుమ్మ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. రైతులు ఎక్కువ‌గా ఈ చెట్టు కాండాన్ని ర‌క‌ర‌కాల వ్య‌వసాయ ప‌నిముట్ల‌ త‌యారీలో ఉప‌యోగించేవారు. మేక‌లు ఈ చెట్టు ఆకుల‌ను ఎంతో ఇష్టంగా తింటాయి. ఈ చెట్టు కాయ‌ల‌ను గేదెలు, ఆవుల‌కు మేత‌గా వేస్తారు. మ‌గ వారిలో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

తుమ్మ జిగురును పొడిగా చేసి నెయ్యిలో వేయించి శ‌రీర బ‌లాన్ని బ‌ట్టి కొద్ది కొద్దిగా తిన‌డం వ‌ల్ల మ‌గ వారిలో వీర్య క‌ణాలు వృద్ది చెందుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. న‌ల్ల తుమ్మ కాయ‌ల ర‌సాన్ని తీసి మినుముల‌తో క‌లిపి ఔష‌ధంగా త‌యారు చేసి తింటూ పాల‌ను తాగ‌డం వల్ల న‌రాల బ‌ల‌హీన‌త‌, వీర్య న‌ష్టం, శీఘ్ర స్క‌ల‌నం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి అమితంగా వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా తుమ్మ చెట్టు బెర‌డు, లేత కాయ‌లు, ఆకులు, పువ్వుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి చూర్ణంగా చేసి స‌మ‌పాళ్ల‌లో క‌లిపి ఆ పొడిని ప్ర‌తిరోజూ పావు టీ స్పూన్ చొప్పున తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌లంగా త‌యార‌వుతారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

కాళ్ల ప‌గుళ్ల‌ను త‌గ్గించే శ‌క్తి తుమ్మ బంకకు ఉంది. తుమ్మ బంక‌ను నీటితో మెత్త‌గా నూరి రాత్రి పూట కాళ్ల ప‌గుళ్ల‌కు లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల క్ర‌మేనా కాళ్ల ప‌గుళ్లు త‌గ్గుతాయి. తుమ్మ ఆకుల‌ను నీటితో నూరి చ‌ర్మానికి రాయ‌డం వల్ల అధిక చెమ‌ట స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తుమ్మ చెట్టు బెర‌డుతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గి బ‌లాన్ని పుంజుకుంటారు. ఈ క‌షాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల చిగుళ్ల‌ వాపు, చిగుళ్ల‌ నుండి ర‌క్తం కార‌డంతోపాటు నోటి పూత‌, నోటిలో ఉండే పుండ్ల‌తోపాటు దంతాల స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. తుమ్మ చెట్టు పూలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Nalla Thumma Chettu
Previous Post

Eye Sight : కంటి చూపు మెరుగు ప‌డాలా.. వీటిని తీసుకుంటే చాలు..!

Next Post

Castor Oil Tree : ఆముదం ఆకుల‌ను నీళ్ల‌లో ఉంచి.. వాటిని త‌ల‌పై పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.