Chinese Fast Food : చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీంతో చాలా మంది ఆ ఫుడ్‌ను ఆబగా తినేస్తుంటారు. అలాగే ఓ యువకుడు కూడా చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను తిన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ తన కాళ్లనే పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు అక్కడి ఓ రెస్టారెంట్‌లో తన స్నేహితులతో కలిసి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తిన్నాడు. చికెన్, రైస్ తదితర ఆహారాలను తిన్నారు. అయితే ఆ యువకుడికి మాత్రం ఫుడ్ పాయిజన్ అయింది. ఓ దశలో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. శ్వాస సరిగ్గా ఆడలేదు. పైగా తలనొప్పి, మెడ పట్టేయడం, కంటి చూపు మందగించడం, వికారం, వాంతులు.. వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అతన్ని స్నేహితులు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించింది.
ఈ క్రమంలోనే వైద్యులు అతనికి చికిత్స చేశారు. అయితే అతని శరీరం పర్పుల్ రంగులోకి మారింది. కాగా అతనికి సదరు ఫుడ్ వల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్దారించారు. అతనికి Neisseria meningitidis అనే వ్యాధి వచ్చిందని నిర్దారించారు. దీంతో అతని శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. చివరకు లివర్ ఫెయిల్ అయింది. దీంతో అతని కాళ్లను తీసేయాల్సి వచ్చింది. లేదంటే శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ అయి ఉండేదని వైద్యులు తెలిపారు. ఇక అతను కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు మాత్రమే తీసుకున్నాడని వైద్యులు తెలిపారు. ఈ వివరాలను న్యూయార్క్ పోస్ట్‌లో వెల్లడించారు.