Fat Reducing Tips : ప్రస్తుత కాలంలో మనందరిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. అధిక బరువుతో బాధపడే వారు బరువు తగ్గాలనుకుంటారు కానీ ఎలా బరువు తగ్గాలో తెలియక సతమతమైపోతుంటారు. వేగంగా బరువు తగ్గాలని వివిధ రకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. ఏది పడితే అది పాటిస్తే బరువు తగ్గకపోగ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన పద్దతిలో బరువు తగ్గాలనుకునే వారు కింద తెలిపే చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు వారానికి కిలో చొప్పున ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల కొవ్వు కరగడంతో పాటు కండరాలు కూడా బలంగా తయారవుతాయి. ఈ చిట్కాలను పాటించడం అలాగే వ్యాయామాలు చేయడం మరిచిపోవద్దు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఒత్తిడి మరియు నీరసం దూరమవుతాయి.
అతి తక్కువ సమయంలోనే బరువు త్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనంలో ప్రోటీన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన డైట్ లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కనుక భోజనంలో ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటే తప్పకుండా బరువు తగ్గవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్, చక్కెరలు ఉన్న పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాలు చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి. కార్బోహైడ్రేట్స్, చక్కెరల వల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ రంగులు ఉన్న పదార్థాలను, ప్రిజర్వేటివ్స్ కలిపిన పదార్థాలు తీసుకోవడం మానివేయాలి. ఇవి అన్నీ కూడా సోడియంతో కూడుకుని ఉంటాయి. కాబట్టి వీటిని పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే వేపుళ్లను, జంక్ ఫుడ్ ను కూడా దూరం పెట్టాలి. జంక్ ఫుడ్స్ వల్ల కడుపులో మంట కలిగి శరీరానికి హానిని కలిగిస్తుంది.
కనుక వాటిని తప్పనిసరిగా దూరం పెట్టాలి. భోజనంలో మిరియాలను కలుపుకుని తినాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గడంలో నీరు అద్భుతంగా పని చేస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొవ్వు కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అలాగే శరీరానికి తగినంత నిద్రపోవాలి. కొన్ని అధ్యయనాలు బరువు పెరగడానికి నిద్రలేమి కూడా కారణం అవుతుందని తెలియజేస్తున్నాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం, అలాగే రాత్రిల్లు స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అంది సులువుగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కొన్ని స్ట్రెస్ హార్మోన్లు విడుదలయ్యి అధిక ఒత్తిడికి కారణమవుతున్నాయి. దీని వల్ల బరువు పెరుగుతున్నారు.
కనుక ప్రతి ఒక్కరు ఏడు గంటలు నిద్ర పోవాలి. వ్యాయామాలు చేయాలి. దీనితో పాటు చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. దాని వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా సమయానికి తీసుకోవాలి. ఆలస్యంగా ఆహారాన్ని తీసుకునే వారి కంటే సరైన సమయంలో ఆహారాన్ని తీసుకునే వారు చక్కటి ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటున్నారని పరిశోధనల్లో తేలింది. సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు చేరుతుంది. కనుక ప్రతి ఒక్కరు సరైన సమయంలో భోజనం చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.