Vegetables For Arteries Cleaning : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే ఈ సమస్యల బారిన పడి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. గుండెజబ్బులు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాలు సరిగ్గా లేకపోవడమే. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా రక్తనాళాలు ఆక్సిజన్ ను, పోషకాలను, రక్తాన్ని శరీరంలోని అవయవాలకు చేరవేస్తాయి. కానీ వీటిలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో పాటు ఇతర గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, అధిక రక్తపోటు అదుపులో ఉండాలన్నా, గుండె ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో ఇప్పుడు చెప్పే కూరగాయలను, ఆకుకూరలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్తనాళాలల్లో ఉండే అడ్డంకులను తొలగించి రక్తనాళాలను శుభ్రపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించడంలో మనకు బీన్స్ ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ ను తొలగించడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో దోహదపడుతుంది. బీన్స్ ను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగపడడంతో పాటు రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలు చక్కగా ఉంటాయి. అలాగే మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో క్యాబేజి కూడా ఒకటి. క్యాబేజిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది.
క్యాబేజిని తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ( ఎల్ డి ఎల్) అదుపులో ఉంటుంది. తరుచూ క్యాబేజిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గుమ్మడికాయ కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. గుమ్మడికాయలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుమ్మడికాయలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే బ్రొకోలిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బ్రొకొలిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది.
రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. బ్రొకొలిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పొటాషియంలో 5 శాతం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అదే విధంగా ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే మనం క్యాప్సికంను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. క్యాప్సికంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే క్యాప్సెసిన్ అనే రసాయన సమ్మేళనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఈ సమ్మేళనం మనకు దోహదపడుతుంది. క్యాప్సికంను తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అదే విధంగా బ్రెసెల్ స్పౌర్ట్స్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆక్సిడెటివ్ స్ట్రెస్ తో పాటు ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. వీటిలో ఉండే ఫైబర్ రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది.
వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ ఆకుకూరలన, కూరగాయలను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. అయితే ఈ కూరగాయలను, ఆకుకూరలను వీలైనంత వరకు ఉడికించి తీసుకోవాలి. నూనె తక్కువగాఉపయోగించి వండి తీసుకోవాలి. అంతేకానీ డీప్ ఫ్రై చేసి తీసుకోకూడదు. నూనె ఎక్కువగా వేసి వండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఈ కూరగాయలు అనారోగ్యానికి దారి తీస్తాయి కనుక ఉడికించి తీసుకోవాలి.