Coconut Water : వేసవి వచ్చిందంటే చాలు.. మనలో అధిక శాతం మంది కొబ్బరి నీళ్లను బాగా తాగుతుంటారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే కొందరు విరేచనాలను అరికట్టేందుకు కూడా కొబ్బరినీళ్లను తాగుతుంటారు. అయితే ఇవే కాదు.. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం వల్ల మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే.. శరీరానికి శక్తిని అందిస్తాయని చెప్పి చాలా మంది స్పోర్ట్స్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అవి కృత్రిమమైనవి. వాటికి బదులుగా సహజ సిద్ధమైన కొబ్బరినీళ్లను తాగితే మనకు ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. అలసట తగ్గుతుంది. యాక్టివ్‌గా మారుతారు. ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువగా చేసేవారు స్పోర్ట్స్ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరినీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిత్యం ఉదయం, సాయంత్రం 300 ఎంఎల్ మోతాదులో కొబ్బరినీళ్లను తాగితే హైబీపీ త్వరగా తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొబ్బరినీళ్లలో గుండెకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లను తాగకూడదని భ్రమ పడుతుంటారు. నిజానికి వారు కూడా పరిమిత మోతాదులో కొబ్బరినీళ్లను తాగవచ్చు. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. పోషకాలు అందుతాయి. డయేరియా వచ్చిన వారు శరీరంలో ఉన్న ద్రవాలను ఎక్కువ మోతాదులో కోల్పోతారు. అలాంటి వారు నీరసం చెందకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లను తాగాలి. కొబ్బరినీళ్లు లివర్‌కు ఎంతగానో మేలు చేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కొబ్బరినీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను రక్షిస్తాయి. లివర్ కణాలు చనిపోకుండా చూస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కొబ్బరినీళ్లు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం కొబ్బరినీళ్లను తాగడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
గర్భిణీలకు కొబ్బరినీళ్లు ఎంతగానో మేలు చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది. అలాగే పుట్టబోయే పిల్లలకు లోపాలు రాకుండా ఉంటాయి. ఇక తల్లుల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాగే గర్భం సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు కూడా పోతాయి. వికారం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కొబ్బరినీళ్లు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో తీసుకునే ఆహారం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. కొబ్బరినీళ్లను తరచూ తాగడం వల్ల పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుందని, అలాగే ఆ వీర్యం నాణ్యంగా కూడా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు నిత్యం కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆ స్టోన్లు ఇట్టే కరిగిపోతాయి. ఈ మేరకు సైంటిస్టులు పలు అధ్యయనాలను కూడా చేపట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. కొబ్బరినీళ్లను తరచూ తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా పోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల వల్ల వృద్ధాప్యం అంత త్వరగా దరి చేరదు. వెంట్రుకల సమస్యలు ఉన్నవారు, చుండ్రుతో బాధపడేవారు కొబ్బరినీళ్లను తాగితే ఫలితం ఉంటుంది.