ఈ మధ్య కాలంలో బైకుల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది. చిన్న చిన్న పనులు చేసుకునే వారు సైతం కొత్త బైకులు కొంటున్నారు. అయితే పలు కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో బైకులని మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. లేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా.. పలు స్టైలిష్ బైకులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయ్. ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే. అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్, బైక్ పనితీరు, మైలేజీని చూసుకుని బైకుని తీసుకుంటూ ఉంటారు. అయితే కొత్తగా వస్తున్న బైకులు చూస్తే వాటికి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. పాత బైకులకి మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే వెలిగేవి.
అయితే కొత్త బైక్‌లను నడుపుతున్నప్పుడు హెడ్లైట్లు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండటానికి కారణం ఏప్రిల్ 1, 2017న ద్విచక్ర వాహనాలలో చేసిన మార్పు. ఈ మార్పు అమలు చేసిన తర్వాత, మీరు బైక్‌ను నడుపుతున్నప్పుడు హెడ్లైట్లని ఆఫ్ చేసే అవకాశం ఉండదు. బైక్ నడుపుతున్నప్పుడు మీరు హెడ్లైట్లను హై బీమ్ లేదా లో బీమ్‌గా మార్చవచ్చు. చాలా కాలంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు తెరపైకి వస్తున్నాయి.దీన్ని తగ్గించేందుకు, ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. తరచుగా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న వాహనాలు కనపడవు.దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్‌ల విజిబిలిటీని దూరం నుంచి తెలుసుకునేలా బైక్‌లో హెడ్లైట్లను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిర్ణయించారు.
హెడ్లైట్లు ఆన్‌లో ఉంచడం ద్వారా, ఇతర వాహనం యొక్క దృష్టి దూరం నుండి బైక్‌పై పడుతుంది. దాని ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని భావించి అలా మార్చారు.ఇక ఇప్పుడు దసరా పండగ ఆఫర్స్ బాగానే ఉండడంతో ఇప్పుడు బైకులు కొనేవారి సంఖ్య చాలానే పెరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాటికి కూడా హెడ్ లైట్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుండడం మనం గమనించవచ్చు.