ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, ఒత్తిడి, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది.
డయాబెటిస్ వస్తే రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. దీంతో అతి దాహం, ఆకలి, చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో కిడ్నీలు, లివర్, కళ్లు దెబ్బతింటాయి. హార్ట్ ఎటాక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
షుగర్ సమస్యతో బాధపడుతున్నవారికి మామిడి ఆకులు వరమనే చెప్పవచ్చు. షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మామిడి ఆకుల్లో టానిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటాయి. అందువల్ల మామిడి ఆకులతో షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకుని కడిగి శుభ్రం చేయాలి. వాటిని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీన్ని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా రెండు, మూడు నెలల పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.
మామిడి ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఆస్తమా, బ్రాంకైటిస్, వెరికోస్ వీన్స్, జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలోనూ మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.