Tirumala : సాధారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి అప్పుల బాధలు ఉంటాయి. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇంకొందరు అసలు ఏం చేసినా కలసి రావడం లేదని భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారందరూ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. కింద చెప్పిన మంత్రాన్ని పఠిస్తే.. ఎటువంటి సమస్యలు అయినా సరే పోతాయి. అయితే ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.
ఓం శ్రీ ఓం నమః ఓం పరమ లక్ష్మై విష్ణు వక్ష స్థితాయై, రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః
పైన తెలిపిన మంత్రాన్ని తిరుమల కొండపై శుక్రవారం రోజు పఠించాలి. 108 సార్లు పఠిస్తే.. ఎవరైనా సరే అనుకున్నవి నెరవేరుతాయి. ఎలాంటి కష్టాల నుంచి అయినా సరే బయట పడతారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. వ్యాపారంలో నష్టాలు వచ్చేవారు, విద్య, ఉద్యోగ సమస్యలు ఏదైనా సరే.. ఈ విధంగా చేయడం వల్ల అన్నింటి నుంచి బయట పడవచ్చు.
అయితే తిరుమల కొండ మీదే ఈ మంత్రాన్ని చదవాలని ఏమీ లేదు.. మీకు దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ఇలా చేయవచ్చు. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. అన్ని సమస్యల నుంచి బయట పడతారు.