Money Plant : ప్రకృతిలో ప్రతి మొక్కకు ఏదో ఒక శక్తి ఉంటుంది. కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే కొన్ని మొక్కలు అదృష్టాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా కొన్ని మొక్కలు పూజించేవిగా, కొన్ని మొక్కలు పూజకు పనికి వచ్చేవిగా ఇలా రకరకాల మొక్కలు ఉంటాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఇది మనకు అదృష్టాన్ని ఇచ్చే మొక్క అని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మన ఆర్థిక సమస్యలను తీర్చడంలో మనీ ప్లాంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనకు వచ్చే ఆర్థిక సమస్యలన్నీ తీరి మనకు ధన ప్రాప్తి కలగాలంటే మనీ ప్లాంట్ తో ఒక పరిహారాన్ని చేయాలని నిపుణులు చెబుతున్నారు. మన సమస్యలన్నీ తీరాలంటే మనీ ప్లాంట్ తో చేయాల్సిన పరిహారం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్ తో ఈ పరిహారాన్ని చేసిన వారికి.. ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ పోయి వారికి ధన లాభం కలుగుతుంది. ముందుగా ఒక మనీ ప్లాంట్ చెట్టును తీసుకుని మన ఇంటి నైరుతి మూలన ఉంచాలి. తరువాత పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారాన్ని సోమవారం, మంగళవారం లేదా శుక్రవారం నాడు చేయాలి.
ఇందుకోసం ముందుగా ఒక రూపాయి బిళ్లను తీసుకుని దానిని ఆవు పాలలో ముంచాలి. తరువాత ఆ రూపాయి బిళ్లను మన ఇంట్లో ఉండే పార్వతీ పరమేశ్వరుల ముందు అలాగే లక్ష్మీనారాయణుల ముందు ఒక ప్లేట్ పెట్టి ఉంచాలి. తరువాత ఆ రూపాయి బిళ్లకు పసుపు, కుంకుమ, గంధం పెట్టి ఆక్షింతలు, పువ్వులతో పూజ చేయాలి. అలాగే ఆ ఆవు పాలను పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమసర్పించాలి. ఇలా సమర్పించిన తరువాత ఆ ఆవు పాలను ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈ విధంగా పూజ చేసిన తరువాత మరలా సాయంత్రం కూడా ఆ రూపాయి బిళ్లకు పూజ చేయాలి. పూజ చేసిన తరువాత ఆ రూపాయి బిళ్లను మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ దగ్గర మట్టి లోపలికి గుంతలా చేసి అందులో ఉంచాలి. ఈ రూపాయి బిళ్లను అలాగే ఒక పదకొండు రోజుల పాటు ఉంచాలి.
పదకొండు రోజుల తరువాత ఆ రూపాయి బిళ్లను తీసి శుభ్రంగా కడిగి దానిని ఒక ఎర్రని వస్త్రంలోకి తీసుకోవాలి. తరువాత ఆ రూపాయి బిళ్ల మీద లక్ష్మీ దేవి పాదాల చెంత ఉండే పసుపును, కుంకుమను, అలాగే ఒక పువ్వును ఉంచి మూటకట్టాలి. ఈ మూటను మన ఇంట్లో డబ్బు లేదా బంగారం దాచే చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల మన దగ్గర ఉండే డబ్బు రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.