Saggubiyyam Challa Punugulu : మనం ఆహారంగా సగ్గు బియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. సగ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ సగ్గు బియ్యంతో మనం రకరకాల వంటకాలను తయాఉ చేస్తూ ఉంటాం. సగ్గుబియ్యంతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చల్ల పునుగులు ఒకటి. సగ్గు బియ్యంతో చేసే ఈ చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా దొరుకుతాయి. సగ్గుబియ్యంతో ఈ చల్ల పునుగులను మనం ఇంట్లో కడా చాలా సులువగా తయారు చేసుకోవచ్చు. సగ్గు బియ్యంతో చల్ల పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం చల్ల పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
లావుగా ఉండే సగ్గు బియ్యం – ముప్పావు కప్పు, పుల్లటి పెరుగు – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, బియ్యం పిండి – 1/3 కప్పు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సగ్గు బియ్యం చల్ల పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో సగ్గుబియ్యం, నీళ్లు పోసి కలుపుకుని 5 గంటల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి పకోడి పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి కొద్ది కొద్దిగాపిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి పునుగులను ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చల్ల పునుగులు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా నిమ్మరసం కారంతో తిన్నా చాలారుచిగా ఉంటాయి. వీటిని ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో ఇలా సగ్గు బియ్యంతో పునుగులను తయారు చేసుకుని తినవచ్చు.