Bones Health : చలికాలంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వెంటడతాయని చెప్పవచ్చు. చలికాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. చలికాలంలో ఎముకలు బలహీనపడి విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో ఎముకలు విరగడం 20 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం శీతాకాలంలో ఎముకలు ధృడంగా ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలను ధృడంగా చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు ధృడంగా ఉండాలంటే మనం శరీరానికి తగినంత క్యాల్షియం అందేలా చూసుకోవాలి. దీని కోసం పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహారాలను తీసుకోవాలి.
ఒక కప్పు పాలల్లో 300 మిల్లీ గ్రాములు, ఒక కప్పు పెరుగులో 400 మిల్లీ గ్రాములు, ఒక కప్పు చీజ్ లో 700 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కనుక ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే బచ్చలికూర, బ్రొకోలి వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిలో విటమిన్ కె తో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బచ్చలికూరలో 250 మిల్లీ గ్రాములు, ఒక కప్పు బ్రొకోలీలో 100 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉండడంతో పాటు రక్తం త్వరగా గడ్డకడుతుంది. అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చాలా అవసరం. కనుక మనం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలను, ట్యూనా చేపలను తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అదే విధంగా బాదం, వాల్ నట్స్, నువ్వులు వంటి వాటిని తీసుకోవాలి. వీటిలో క్యాల్షియంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు గుల్లబారకుండా ధృడంగా ఉంటాయి. అలాగే సోయా గింజలతో తయారు చేసిన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. సోయా పాలు, టోఫు వంటి వాటిని తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుంది. అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో విటమిన్ డి కూడా మనకు దోహదపడుతుంది. కనుక గుడ్లను ఆహారంగా తీసుకోవాలి. ఒక గుడ్డులో 40యుఐ విటమిన్ డి లభిస్తుంది. ఈ విధంగా చలికాలంలో ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.