మనం బాగుండాలంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలని పాటిస్తూ ఉండాలి. మనం పాటించే పద్ధతులు, మనం అనుసరించేవి ఎటు వెళ్లిపోవు. మంచికి మంచే జరుగుతుంది. చాలామంది పూర్వికులు పాటించే పద్ధతుల్ని కొట్టి పరుస్తున్నారు. కానీ ఆ తప్పును చేయకూడదు. పురుషులైతే ఖచ్చితంగా ఈ పొరపాటులని చేయకుండా చూసుకోవాలి. తప్పకుండా పురుషులు ఈ నియమాలను పాటించాలి. మరి పురుషులు ఎలాంటి నియమాలని పాటించాలి అనేది ఇప్పుడు చూసేద్దాం.
ఎప్పుడూ కూడా పురుషులు, ఏదైనా శుభకార్యానికి ఆహ్వానం అందకపోతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు. అదేవిధంగా బ్యాంకు బాలన్స్ ఎంత ఉంది అనే విషయాన్ని కూడా అస్సలు ఎవరికీ చెప్పకూడదు. స్నేహాన్ని దూరం చేసుకుంటే, వారిని ఎప్పుడు కూడా బతిమలాడకూడదు. అది అసలు మంచిది కాదు. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే బహిరంగంగా వాళ్ళని అవమానించకండి. అలా చేయడం వలన అతను మీకు శత్రువు అయిపోతాడు.
భార్యకు తెలియకుండా పర స్త్రీ తో సంబంధాన్ని పెట్టుకోకూడదు. ఎప్పుడు మీ భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకి రక్షణగా ఉండాలి. పురుషులు కూర్చున్నప్పుడు ఎవరితో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. మిమ్మల్ని ఎప్పుడూ అభిమానించే వారిని గౌరవించాలి. మీరు చేయని పనికి అనవసరంగా క్రెడిట్ ని తీసుకో వద్దు. విజయం సాధిస్తే మొత్తం మీ టీం కి సమానంగా క్రెడిట్ ఇవ్వాలి.
అలా పూర్తి క్రెడిట్ తీసుకోవడం తప్పు. ఇతరులతో డబ్బు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం లో ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, మీ భార్య కి సమయాన్ని ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా పురుషులూ వీటిని కనుక మీరు జీవితంలో పాటించారంటే, మీరు అందమైన జీవితాన్ని గడపడానికి అవుతుంది. సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించడానికి అవుతుంది.