Karthika Deepam Soundarya : బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ అంటే చాలా మందికి తెలుసు. ఈ సీరియల్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నటించే వారందరూ ప్రేక్షకులకు బగా పరిచయం అయ్యారు. వాళ్లను ఇంట్లోని మనుషులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపను వంటలక్కగా ప్రేక్షకులు దగ్గర చేసుకున్నారు. ఆమె భర్తను డాక్టర్ బాబుగా అభిమానిస్తున్నారు. ఈ సీరియల్ ఎంతో కాలం నుంచి ప్రసారం అవుతున్నప్పటికీ ఇంకా ఆదరణ తగ్గలేదు.
ఈ సీరియల్‌లో కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల ఎంతో అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు. అలాగే ఆయన తల్లిగా అర్చన కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. సీరియల్‌లో ఇద్దరూ తల్లీ కొడుకులుగా బాగా సెట్ అయ్యారు. ఇక ఈ సీరియల్‌కు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. నిజంగానే నిరుపమ్‌కు అర్చనను అమ్మ అనుకుంటున్నారు. అంతగా ప్రేక్షకులు ఈ సీరియల్‌ను అభిమానిస్తున్నారు.
కాగా అమ్మ పాత్రలోనూ అర్చన చక్కగా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈపాత్రలో ఆమెను చూసిన ప్రేక్షకులు ఆమెకు 40 ఏళ్లు పైగానే ఉంటాయని అనుకుంటున్నారు. కానీ ఆమె అసలు వయస్సు ఎంతో తెలిస్తే షాకవుతారు. వీరు తల్లీకొడుకులుగా నటిస్తున్నారు కానీ.. వీరు వాస్తవానికి ఒకే ఏడాదిలో జన్మించారు. అర్చన, నిరుపమ్ ఇద్దరూ ఒకే ఏడాదిలో పుట్టారు. 1988లో అర్చన జన్మించగా.. ఆ ఏడాది చివర్లో నిరుపమ్ పుట్టాడు. కానీ చూసేందుకు మాత్రం ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇక కార్తీక దీపం సీరియల్‌కు నిన్న మొన్నటి వరకు బాగానే రేటింగ్స్ వచ్చాయి. కానీ సీరియల్‌ను ఇంకా సాగదీస్తుండడం ప్రేక్షకులకు నచ్చడం లేదు. దీంతో ఇటీవల రేటింగ్స్ కొంత తగ్గాయి. మరి దీన్ని నిర్వాహకులు ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి.