Thotakura : ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టమే. ఆకుకూరలను చాలా మంది జ్యూస్ చేసుకుని ఉదయాన్నే పరగడుపునే తాగుతుంటారు. అలాగే కొందరు నేరుగా కూరలను చేసుకుని తింటుంటారు. ఆకుకూరలతో పప్పు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల ఆకుకూరలు కూడా అందుబాటులో ఉన్నాయి. గోంగూర, చుక్క కూర, పాలకూర.. ఇలా పలు రకాల ఆకుకూరలు మనకు లభిస్తున్నాయి. అయితే చాలా మంది అన్ని రకాల ఆకుకూరలను తింటారు. కానీ తోటకూరను మాత్రం తినరు. ఎందుకంటే ఇది పసరు వాసన వస్తుందని చాలా మంది తోటకూరను తినేందుకు అంతగా ఆసక్తిని చూపరు. కానీ తోటకూరను తినకపోతే ఎన్నో లాభాలను కోల్పోయినట్లే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవును.. తోటకూరను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వాటిని తినకపోతే మాత్రం ఎన్నో లాభాలను పొందలేమని అంటున్నారు. ఇక తోటకూర వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరను చాలా మంది చికెన్, మటన్‌తో పోలుస్తారు. ఎందుకంటే మాంసాహారానికి సమానమైన ప్రోటీన్లు తోటకూరలో ఉంటాయని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. అయితే మాంసాహారానికి మించి ఇతర పోషకాలు మాత్రం తోటకూరలోనే ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు తోటకూరలో ఉంటాయి. కానీ మాంసంలో ఉండవు. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల తోటకూరను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర చక్కని ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీన్ని 100 గ్రాముల మోతాదులో తిన్నా మనకు కేవలం 23 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. పైగా తోటకూరలో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడే అంశం. కనుక బరువు తగ్గాలనుకునే వారు తరచూ తోటకూరను తింటుండాలి. ఇక తోటకూరను తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతోపాటు జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా తోటకూరను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అందువల్ల ఇది ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.