సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను, నియమాలను ఎంతో పద్ధతిగా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలోనే సూర్యాస్తమయం అయిన తరువాత పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పెద్దవారు పదేపదే చెబుతుంటారు.
అలా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేయటంవల్ల పరమ దరిద్రమని చెబుతారు. మరి సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.. అనే విషయాలకు వస్తే..
సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని పెద్దలు చెబుతుంటారు. దీంతో అన్నీ సమస్యలే వస్తాయట.
అదే విధంగా సాయంత్రం అయిన తర్వాత ఉప్పును ఇతరులకు దానం చేయకూడదు. ఇలా ఉప్పు దానం చేయటం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని అంటారు.
ఇక సూర్యాస్తమయం అయిన తరువాత అంత్యక్రియలను చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలను చేయటం వల్ల చనిపోయిన వారు పరలోకంలో ఎన్నో ఇబ్బందులు పడతారని, వచ్చే జన్మలో వారు దివ్యాంగులుగా జన్మిస్తారని చెబుతుంటారు.
అలాగే చాలామంది సాయంత్రం సమయంలో నిద్రపోతుంటారు. ఇలా నిద్రపోవడం పరమ దరిద్రం అని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయని పండితులు చెబుతున్నారు. కనుక సూర్యుడు అస్తమించిన తరువాత ఈ పనులను ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. లేదంటే అన్నీ సమస్యలే వస్తాయి.