Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

Admin by Admin
May 26, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళి టోర్నీలో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించే దినేష్ కార్తీక్ 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు. నికిత తండ్రి, దినేష్ కార్తీక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ గా ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు.

అయితే దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళి విజయ్ అతని మొదటి భార్య నికితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేష్ కార్తీక్ కి తెలియడంతో నిఖితాకి విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ తో విడాకులు తీసుకున్న నికితను పెళ్లాడిన మురళి విజయ్ కు ప్రస్తుతం కూతురు, ఓ బాబు ఉన్నారు. 2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కి, మురళి విజయ్ కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది. భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితకి విడాకులు ఇచ్చేశాడు. దినేష్ కార్తీక్ కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రి అని తెలుసుకున్న మురళి విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

how dinesh karthik first wife married murali vijay

ఇప్పుడు నికిత, మురళి విజయ్ లకు ముగ్గురు పిల్లలు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళి విజయ్, దినేష్ కార్తీక్ ఈ సంఘటన తర్వాత బద్ధశత్రువులుగా మారిపోయారు. దినేష్ కార్తీక్ తో మాట్లాడటానికి కానీ, ముఖం చూపించడానికి కానీ మురళి విజయ్ సాహసించడు. అంతేకాకుండా దినేష్ కార్తీక్ గ‌తంలో నిధాహాస్ టోర్నీ సమయంలోనూ మురళి విజయ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన కార్తీక్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేసి ట్రోల్స్ బారిన పడ్డాడు మురళి విజయ్. నికిత, మురళి విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేష్ కార్తీక్ 2017 లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ తో ప్రేమలో పడ్డాడు. ఒకే కోచ్ దగ్గర ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అసహ్యించుకునే దీపిక, దినేష్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది. ఇప్పుడు ఇండియన్ స్పోర్ట్స్ సెలబ్రిటీల్లో అన్యోన్యమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags: dinesh karthikmurali vijay
Previous Post

ఈ క్రీమును రాస్తే ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగానే క‌నిపిస్తార‌ట‌.

Next Post

పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.