James Movie Review : కన్నడ స్టార్ నటుడు పునీత్ కుమార్ నటించిన చివరి చిత్రం.. జేమ్స్. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పునీత్ చనిపోయిన తరువాత వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ? కథ ఏమిటి ? అన్న విషయాలకు వస్తే..
కథ..
బెంగళూరు నగరం మొత్తం అండర్ వరల్డ్ మాఫియాతో నిండిపోతుంది. రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) తన ప్రాణాలకు రక్షణగా సంతోష్ (పునీత్ రాజ్ కుమార్)ను సెక్యూరిటీగా నియమించుకుంటాడు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల నడుమ సంతోష్.. విజయ్‌ని, అతని సోదరి ప్రియ (ప్రియా ఆనంద్)ని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో సంతోష్ తాను జేమ్స్ అని అసలు విషయం చెబుతాడు. అయితే అసలు జేమ్స్ ఎవరు ? అతనికి అండర్ వరల్డ్‌కు ఉన్న సంబంధం ఏమిటి ? విజయ్‌ని, అతని సోదరిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? చివరకు ఏం జరుగుతుంది ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే.. ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
పునీత్ రాజ్‌కుమార్ గొప్పనటుడు. కనుక ఆయన నటనకు పేరుపెట్టాల్సిన పనిలేదు. పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. కనుక యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఇక ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్‌లు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. పునీత్ చేసే స్టంట్స్ బాగుంటాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగా పండాయి. ఓవరాల్‌గా చూస్తే జేమ్స్ ఆకట్టుకునే చిత్రం అని చెప్పవచ్చు.