Dark Chocolate : డార్క్ చాక్లెట్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ఘాటైన మరియు చేదు, తీపి రుచులను కలిగి ఉంటుంది. దీనిని రకరకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉండచంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీనిని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఫ్రీ రాడాకల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా దీనిలో ఉండే మోనో స్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు జీవక్రియలను మెరుగుపరిచి బరువు తగ్గేలా చేయడంలో కూడా సహాయపడతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని దేనినైనా అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. డార్క్ చాక్లెట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది రక్తం యొక్క గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గుతుంది.
అలాగే దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా డార్క్ చాక్లెట్ ను అధిక మొత్తంలో తినడం వల్ల మలబద్దకం సమస్య తలెత్తే అవకాశం ఉంది. అలాగే దీనిలో ఉండే కెఫిన్ శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడేసే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల దీనిలో ఉండే కెఫిన్ మరియు బీటా – ఫెనిలేథైలమైన్ లు తలనొప్పిని ప్రేరేపిస్తాయి. కనుక దీనిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. డార్క్ చాక్లెట్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.