Tomato Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశలను తయారు చేయడం చాలా సులభం. ప్రతి ఒక్కరు వీటిని విరివిరిగా తయారు చేస్తూ ఉంటారు. మనం మన అభిరుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన దోశ వెరైటీలలో టమాట దోశ కూడా ఒకటి. టమాట దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, టమాటాలు ఉంటే చాలు ఈదోశలను 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – 3 కప్పులు, టమాటాలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీ, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత దీనిని పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నూనెను వేయాలి. తరువాత ఉల్లిపాయతో రుద్దాలి. ఇప్పుడు పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి చల్లుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసుకోవాలి. దోశ ఎర్రగా కాలిన తరువాత మధ్యలోకి మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట దోశ తయారవుతుంది. దీనిని కొబ్బరి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే దోశలతో పాటు అప్పుడప్పుడూ ఇలా టమాట దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.