ప్రపంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టిందని, దాని వలన చాలా మంది ప్రజలు ఇబ్బంది పడడం చూసి ప్రతి ఒక్కరు ఆ దేశాన్ని తిట్టిపోసారు. అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగమనంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు. ఈ డ్యామ్ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్ డ్యామ్‌ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి. ఈ భారీ డ్యామ్ కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గిందని నాసా సైంటిస్టులు గుర్తించారు.
అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. మూడు నదులు ఒకచోట కలిసే ప్రాంతంలో నిర్మించారు. డ్యాం పూర్తి కావడంతో తమ వద్ద అత్యాధునిక సాంకేతికత, ఇంజినీర్లు ఉన్నారని గొప్పగా చెప్పుకున్నారు. లక్షల ఎకరాల్లో సాగు, తాగు నీరు అందించేలా చేశారు. కానీ.. ఆ డ్యామ్ వల్ల మానవాళి మనుగడే ప్రమాదంగా మారుతుందని గుర్తించలేకపోయారు.నీటి ఒత్తిడి భరించలేక భూభ్రమనంలో మార్పులు వస్తున్నాయంటే డ్యామ్ ఏ స్థాయి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ గురించే ఇదంతా. ఈ డ్యామ్‌తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1994లో ప్రారంభించిన చైనా 2006 నాటికి పూర్తిచేసింది. డ్యామ్ కోసం 114 పట్టణాలు, 1,680 గ్రామాలను చైనా ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం రానురానూ ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘ఐఎఫ్ఎల్ సైన్స్’ తాజా కథనం ప్రకారం, గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ సమానంగా పరుచుకుంటాయి. ఒక్కచోట ఏదైనా భారీ బరువు చేరితే..‘ఇనెర్షియా’వల్ల సదరు వస్తువు తిరిగే వేగం తగ్గుతుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్‌తో భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు సైంటిస్టులు చెబుతున్నారు.