ఇటీవలి కాలంలో వింత వ్యాధులు ప్రజలని ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దీని వలన ఆసుపత్రికి వెళ్లడం తప్పనిసరి అయింది. అయితే ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్, నర్స్ తెలుపు రంగు కోటు, ఆఫ్రాన్ ధరించి ఉంటారు. అయితే ఇన్ని రంగులు ఉండగా, వారు తెలుపు రంగునే వారు ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే.. 19వ శతాబ్దం వరకూ వైద్యులకు పెద్దగా ప్రాధాన్యత ఉండేదికాదు. వైద్యులపై ప్రజలకు ప్రత్యేక భావం, నమ్మకం ఉండేదికాదు. తెల్లకోటు ధరించిన శాస్త్రవేత్తలను, వైద్యులను కించపరుస్తుండేవారు. ఇది వారి ప్రతిష్టకు భంగం కలిగించేది.
అయితే ఇదే సమయంలో అప్పటి పాలకులు, రాజులు.. శాస్త్రవేత్తలు, వైద్యుల సేవలను గుర్తించి వారిని ప్రశంసలతో ముంచెత్తుతూ, బహుమతులు అందించేవారు. ఈ వైద్య వృత్తి క్రమంగా సైన్స్‌గా మారింది. 1889 నుంచి వైద్యులు తెల్లని కోటు ధరించడం ప్రారంభించారు. వైద్యులు తెల్లకోటు ధరించడానికి ఆద్యునిగా కెనడాకు చెందిన డాక్టర్ జార్జ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరును చెబుతారు. మరోవైపు తెలుపు రంగు స్వచ్ఛత , ఆరోగ్యకరమైన జీవనశైలికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, తెల్లటి కోటు ధరించడం వల్ల రోగులు చాలా ప్రశ్రాంతంగా ఉంటారని భావిస్తుంటారు. మరోవైపు తెల్లటి కోటు వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం ఉంది. రక్తం లేదా రసాయనాలు వంటి మరకలు తెల్లటి బట్టపై సులభంగా కనిపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నివారణకు కీలకమైన చర్యగా వారు భావిస్తారు.
దాదాపు 70 శాతం కేసుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా వైట్ కోట్ సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల, వైద్యులు తెల్లని బట్టలు ధరించడం వెనుక ఉన్న కారణాలు ఆరోగ్యం, భద్రతతో పాటు రోగికి విశ్వాసం కలిగించడం ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇక శస్త్రచికిత్స సమయంలో ఆకుపచ్చ వస్త్రం దరిస్తారు. అది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది.చాలా చోట్ల, సర్జన్లు శస్త్రచికిత్స సమయంలో నీలం మరియు తెలుపు దుస్తులను కూడా ధరిస్తారు. కానీ ఆకుపచ్చ రంగు మంచిది ఎందుకంటే దానిపై రక్తపు మచ్చలు గోధుమ రంగులో కనిపిస్తాయి.