Pidatha Kinda Pappu : మనం అనేక రకాల చిరు తిళ్లను తింటూ ఉంటాం. వాటిలో మరమరాలతో చేసే పిడత కింద పప్పు కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పిడత కింద పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పిడత కింద పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – 3 లేదా 4 కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 3 టీ స్పూన్స్, నిమ్మరసం – అర టీ స్పూన్, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్.
పిడత కింద పప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మరమరాలను వేసి కొద్దిగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిలో పల్లీలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి చేత్తో కొద్దిగా నలుపుతూ బాగా కలుపుకోవాలి. చివరగా పల్లీలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా చేయడ వల్ల ఎంతో రుచిగా ఉండే పిడత కింద పప్పు తయారవుతుంది. సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా దీనిని తినవచ్చు. బయట దొరికే చిరు తిళ్లను తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. పిడత కింద పప్పును తినడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. క్యాలరీలు కూడా పెద్దగా ఉండవు. కనుక బరువు తగ్గాలనుకునేవారికి ఇవి చక్కని ఆప్షన్ అని చెప్పవచ్చు.