Tomato For Osteoporosis : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలోనే లభిస్తాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందువల్ల టమాటాలను తినేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి టమాటాలను పచ్చిగా తింటేనే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయట. వండుకుని తినడం వల్ల ఎలాంటి కిడ్నీ స్టోన్స్ రావని చెబుతున్నారు. కాబట్టి టమాటాలను పచ్చిగా తినకండి. వండుకునే తినండి. ఇక టమాటాలతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలను గుల్లగా మార్చి బలహీనంగా చేసే ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా చూడడంలో టమాటాలు ఎంతో కీలకపాత్రను పోషిస్తాయి. కనుక టమాటాలను రోజూ కనీసం ఒకటి అయినా తినాల్సి ఉంటుంది.
ఇక టమాటాల్లో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు.. ఎముకలు బలంగా మారేలా చేస్తుంది. లైకోపీన్ ఎముకల్లో కాల్షియం బయటకు పోకుండా చూస్తుంది. కాల్షియం ఎముకలకు బాగా అందేలా చూస్తుంది. దీంతో ఎముకలు గుల్లబారిపోవు. బలంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉండే కాల్షియం ఎముకలు సరిగ్గా అందేలా చేయడంలో లైకోపీన్ ఎంతగానో సహాయపడుతుంది. కనుక టమాటాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇక వయస్సు పైబడిన వారికి సహజంగానే కీళ్ల నొప్పులు, ఇతర ఎముకల సమస్యలు ఉంటాయి. వారు సైతం రోజుకు ఒక్క టమాటాను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ దాన్ని పచ్చిగా కాకుండా వండుకుని తినాలని చెబుతున్నారు. దీంతో టమాటాలు శరీరానికి కాల్షియం పుష్కలంగా లభించేలా చేస్తాయి. దీని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇలా టమాటాలతో ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఇతర ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పోషకాలు అందుతాయి. కనుక టమాటాలను ప్రతి ఒక్కరూ రోజూ తప్పక తీసుకోవాల్సిందే. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.