Weight Loss Tips : మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అయిన విటమిన్స్, మినరల్స్ పండ్లలో దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా మన శరీర బరువును తగ్గించడానికి కూడా పండ్లు దోహదపడతాయి. ఇక శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఈ కింద తెలిపిన పండ్లను తరచూ తీసుకోవడం వల్ల త్వరగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.
1. సాధారణంగా కాలంతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ విధమైన పండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జామ మనకు అన్ని కాలాలలోనూ దొరుకుతుంది. జామలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం అవుతూ శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. బరువు తగ్గుతారు.
2. అధిక శాతం నీటిని కలిగి ఉన్న పుచ్చకాయ, కీరదోస, టమాటో వంటి పండ్లను తీసుకోవడం వల్ల త్వరగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.
3. ప్రతి రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. ఆపిల్ లో డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడానికి దోహదం చేస్తాయి.
4. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిలో అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు.
5. ద్రాక్షలో అన్ని రకాల విటమిన్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల బరువు తగ్గించడానికి ద్రాక్ష ఎంతో దోహదపడుతుంది.
వీటితోపాటు సీజన్లలో లభించే పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు.