Vastu Tips : ఇంట్లో ఒకరిద్దరికి కాకుండా అందరికీ కష్టాలు వస్తున్నాయంటే.. ఆ ఇంట్లో కచ్చితంగా ఏదో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఇంట్లోని అందరికీ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు బాగా వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు కింద తెలిపిన విధంగా సలహాలను పాటిస్తే.. దాంతో వాస్తు దోషం పోతుంది. నెగెటివ్ ఎనర్జీ పోయి కష్టాలు తప్పుతాయి. మరి ఆ సలహాలు ఏమిటంటే..
ఆలమ్‌ను చాలా మంది చూసే ఉంటారు. దాన్ని బార్బర్ షాపుల్లో ఎక్కువగా గమనించి ఉంటారు. అయితే ఇది వాస్తుకు కూడా పనిచేస్తుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ చిన్న ఆలమ్ ముక్కను ఉంచాలి. అలాగే ఆఫీస్‌లో అయితే పనిచేసే రూమ్‌లలో ఉంచాలి. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. దీంతో ఇంట్లో ఉండే అందరికీ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల నుంచి విముక్తి లభిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు.
ఇక దుష్ట శక్తులను తరిమేందుకు కూడా ఆలమ్ పనిచేస్తుంది. ఆలమ్ ముక్కను ఇంట్లో ఉంచడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. దిష్టి ఏర్పడకుండా ఉంటుంది. అలాగే చిన్న ఆలమ్ ముక్కను ఒక నల్లని వస్త్రంలో చుట్టి రాత్రి నిద్రించే ముందు దిండు కింద పెట్టుకోవాలి. దీని వల్ల పీడకలలు రాకుండా ఉంటాయి.