Fruits For Diabetes : మనలో చాలా మంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే ఏది పడితే అది తినకూడదు , పండ్లను తినకూడదు.. ఇలా అనేక రకాల అపోహలను కలిగి ఉంటారు. షుగర్ వ్యాధిపై కలిగే ఉండే అపోహల గురించి అలాగే ఈ అపోహలు ఎంత వరకు నిజం అన్న వివరాలను.. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి… వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పండ్లు తింటే షుగర్ పెరుగుతుందని పండ్లలను తినడం మానేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధిని పెంచే అన్నం, ఇడ్లీ వంటి వాటిని తింటూ ఉంటారు. షుగర్ వ్యాధిని పెంచని పండ్లు కూడా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. నరాల మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. షుగర్ వ్యాధి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి. బొప్పాయి, కర్బూజ, జామ, పుచ్చకాయ, కమలా, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ, నేరేడు, రేగి పండ్లు వంటి పండ్లను తినడం వల్ల షుగర్ వ్యాధి పెరగకుండా అదుపులో ఉంటుంది. ఈ పండ్లల్లో ఉండే చక్కెరలు కూడా ప్రక్టోజ్ రూపంలో ఉంటుంది.
కనుక ఈ చక్కెరలు వెంటనే రక్తంలో కలవకుండా ఉంటుంది. అలాగే మనలో చాలా మంది షుగర్ వ్యాధి జన్యుపరంగా తప్పకుండా వస్తుందని మన పెద్ద వారికి ఉంటే మనకు కూడా వస్తుందని అనుకుంటూ ఉంటారు. జన్యుపరంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. జన్యుపరంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పటికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మనం షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం పోదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
జీవన శైలిలో మార్పుల కారణంగా తలెత్తే సమస్య ఇది కనుక మన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలల్లో కూడా షుగర్ వ్యాధి వస్తుంది. చాలా మంది ప్రసవం తరువాత కూడా ఇది పోదు అలాగే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ షుగర్ వ్యాధి వచ్చిందని బాధపడకుండా, ఒత్తిడికి గురి కాకుండా తగిన ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే ప్రసవం తరువాత షుగర్ వ్యాధి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కష్టపడి పని చేసే వారికి, చెమటోడ్చి పని చేసే వారికి షుగర్ వ్యాధి రాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
కానీ ఇది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఎంత కష్టపడినా మూడు పూటలా అన్నాన్ని, బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు పాలిష్ పట్టిన రవ్వలతో చేసిన పదార్థాలను, బ్రెడ్, ఉప్మా, ఇడ్లీ , మైదా పిండితో చేసిన పదార్థాలను తీసుకోకూడదు. షుగర్ వ్యాధి గ్రస్తులు రోజూ ఉదయం వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి. మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవాలి. మల్టీ గ్రెయిన్ పిండితో ఒకటి లేదా రెండు పుల్కాలను ఎక్కువ కూరతో కలిపి తినాలి. అలాగే సాయంత్రం ఆరు గంటల సమయంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను, పండ్లను తీసుకోవాలి. ఇలాంటి ఆహార నియమాలను పాటిస్తూ రోజుకు రెండు పూటలా వ్యాయమాం చేయడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.