Kiwi Fruit : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో కివి పండు కూడా ఒకటి. ఈపండు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండును తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కివి పండులో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కివి పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ పండ్లను తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్ ల సంఖ్య పెరుగుతుంది.
తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే పండ్లను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా కివి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా అధికంగా తీసుకోవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కివి పండ్లను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. మన శరీరానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. కివి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కివి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మంపై దురద, దద్దుర్లతో పాటు వాపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే కివి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒరల్ అలర్జిక్ సిండ్రోమ్( ఒఎఎస్) వంటి సమస్య బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒఎఎస్ కారణంగా నోటిలో దురద రావడం, నాలుక మరియు పెదవులపై దురద రావడం అలాగే పెదవులు, నాలుకపై వాపు రావడం వంటివి జరుగుతాయి. అలాగే కివి పండ్లను అతిగా తీసుకోవడం వల్ల ప్రాంకియాటిస్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఈ పండ్లను అధికంగా తినడం వల్ల వాంతులు, డయేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కివి పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ పండ్లను తగిన మోతాదులో తీసుకుని దాని వల్ల కలిగే ప్రయోజనాలను పొందవలసిందిగా నిపుణులు సూచిస్తున్నారు.