మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో క్యారెట్ ఒకటి. క్యారెట్లు మనకు ఏడాది పొడవునా ఎప్పుడైనా సరే లభిస్తాయి. క్యారెట్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు వాటిలో ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే క్యారెట్లను నేరుగా తినలేని వారు రోజూ వాటి జ్యూస్ తాగవచ్చు. రోజూ ఒక కప్పు మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. క్యారెట్లలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల మొటిమలు సులభంగా తగ్గుతాయి. రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
2. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. కానీ రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల గోళ్లు, చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లలోని బీటాకెరోటిన్ గోళ్లను, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అవి చిట్లిపోకుండా ఉంటాయి.
4. క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే మంచిది.
5. క్యారెట్లలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఎ, సి, కె, పొటాషియం, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి.
6. క్యారెట్లలో విటమిన్లు ఎ, సిలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
7. క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు క్యారెట్‌లలో ఉంటాయి. అందువల్ల రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
8. క్యారెట్‌ల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ తక్కువ. అందువల్ల వీటి జ్యూస్‌ను తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
9. క్యారెట్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
10. క్యారెట్‌లను తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచిది. దీంతో లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365