ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం భారతదేశంలోనే సుమారుగా 5 కోట్ల మందికి పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. కొందరికి డయాబెటిస్ నియంత్రణలో ఉండడం లేదు. అయితే మామిడి ఆకులను ఉపయోగించి షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు. ఈ చిట్కాను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆస్తమా సమస్య కూడా తగ్గుతుంది.
మామిడి ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. 2010లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మామిడి ఆకుల నుంచి తీసిన పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గాయని తేలింది. అందువల్ల వీటిని ఉపయోగించి డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.
మామిడి ఆకులను 15 తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
మామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. అందువల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
ఇక డయాబెటిస్ వల్ల రాత్రి పూట కొందరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ మామిడి ఆకుల నీటిని తాగితే ఆ ఇబ్బంది ఉండదు. కంటి చూపు మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365